సచివాలయ సేవలు ప్రజలకు తెలియాలి..
Ens Balu
2
Nellimarla
2020-11-18 19:18:24
గ్రామసచివాలయాల ద్వారా ఎన్ని సేవలు అందుతున్నాయో వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సిబ్బందిని ఆదేశించారు. నెల్లిమర్ల నగర పంచాయితీ పరిధిలోని 7వ నెంబరు వార్డు సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రజలు అర్జీ చేసుకున్న ఏ సమస్యనైనా పరిష్కరించేలా సిబ్బంది అవగాహన పెంచుకోవాలన్నారు. సచివాలయం నుంచి జిల్లా కేంద్రానికి సమస్యలు రాకుండా చూడాలన్నారు. అనంతరం సచివాలయంలోని రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డుల పంపిణీపై ప్రశ్నించారు. ఇ-రిక్వెస్టులు పెండింగ్‌పై ఆరా తీశారు. వైఎస్ఆర్ జలకళ, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలకు వచ్చిన దరఖాస్తులపై వాకబు చేశారు. పరిపాలన క్షేత్రస్థాయికి తీసుకురావాలని, ఇంటిముంగిటే ప్రభుత్వ సేవలను అందించాలన్న గొప్ప ఆశయంతో, ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, ఆ లక్ష్యాలను సాధించే దిశగా సిబ్బంది కృషి చేయాలని జెసి వెంకటరావు కోరారు.