ఎమ్మెల్యే వాసుపల్లికే మా పరిపూర్ణ మద్దతు..
Ens Balu
2
ఆశీల్ మెట్ట
2020-11-19 14:45:30
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు 29 వ వార్డు మాజీ అధ్యక్షులు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మన్యాల శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆశీల్ మెట్ట వాసుపల్లి కార్యాలయంలో సుమారు 200 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యేను కలిసి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలకు ఆకర్షితుడనై తాను వైసీపీలో జాయిన్ అయినట్టు చెప్పారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి వెంటే తాము ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బొట్ట మల్లి, బొట్ట రాము, వీరుబాబు తదితరులు పాల్గొన్నారు.