అరుణకుమారికి JNTUK పీహెచ్డీ..
Ens Balu
3
కాకినాడ జెఎన్టీయూ
2020-11-19 16:06:13
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ పి.అరుణకు మారికి పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ‘‘డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎఫీషియంట్ ఫీచర్ సెలెక్షన్ మెకానిజమ్స్ ఎట్ ఫీచర్ లెవెల్ ఫ్యూజన్ ఇన్ మల్టీమోడల్ బయోమెట్రిక్ సిస్టమ్స్ ఫర్ పెర్సన్ ఐడెంటిఫికేషన్’’ జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. పి.అరుణ కుమారి తన సిద్ధాంత వ్యాసాన్ని విజయనగరంలోని జెఎన్‌టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం (యుసిఇవి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి డా.జి.జయసుమ ఆధ్వర్య పర్యవేక్షణలో సిద్ధాంత వ్యాసం సమర్పించారు. పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు ఈమెకు పిహెచ్‌డి ‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ అవార్డు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగంలో లభించినది. పి.అరుణ కుమారి ప్రస్తుతం విజయనగరంలోని జెఎన్‌టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం (యుసిఇవి) సిఎస్‌ఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.