ఇళ్ళ పట్టాల పంపిణీకి సిద్ద్ధం కావాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-11-19 17:08:00
పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద డిసెంబర్ 25 న నిర్వహించే పట్టాల పంపిణీ కార్యక్రమానికి రెవిన్యూ అధికారులంతా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. అదే రోజున జిల్లాలో సుమారు 35 వేల గృహ నిర్మణాలను కుడా గ్రౌన్దింగ్ చేసేందుకు తగు ఏర్పాట్లను గావించాలన్నారు. మున్సిపల్ కమీషనర్ లు, మండల స్థాయి అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ ఇళ్ళ స్థలాల పంపిణి, పలు ప్రభుత్వ పధకాల కోసం అవసరమగు భవనాలకు స్థలాల గుర్తింపు, వై.ఎస్.ఆర్ జల కళ , ఓటర్ల నమోదు తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండల వారీగా సమీక్షించారు. ఇళ్ళ పట్టాల కోసం స్పందన లో అందిన దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులైన వారిని జాబితాలలో చేర్చాలని అన్నారు. ఇప్పటికి లాటరి తీయని వారు వెంటనే లాటరి తీసి స్థలాలను కేటాయించాలని, ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనీ ఆదేశించారు. జగనన్న పచ్చ తోరణం క్రింద లే అవుట్లలో మొక్కలను వేయాలని అన్నారు. కోర్ట్ కేసులు ఉన్న చోట ప్రత్యామ్నాయ స్థలాలను చూడాలని సూచించారు. ఇళ్ళ స్థలాలకు సంబంధించి జిల్లాలో 92 కోర్ట్ కేసులున్నాయని, వాటిలో 59 పరిష్కారమైపోయాయని, మిగిలిన 33 కేసులకు కౌంటర్లు వేయాలని, యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యేలా జి.పి లతో మాట్లాడుకోవాలని సూచించారు. అదే విధంగా పెండింగ్ కేసులకు సంబంధించి ప్రత్యామ్నాయ స్థలాలను కూడా సిద్ధం చేసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలలైన సచివాలయాలు, వెల్నెస్ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలకు అవసరమగు స్థలాలను గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలను వై.ఎస్.ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చారని, వాటి కోసం మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న స్థలాలను, వినియోగం లో లేని భవనాలను గుర్తించాలని, అదే విధంగా రైతు బజార్ల కోసం కేటాయించి ఏర్పాటు చేయకుండా ఉన్న స్థలాలను కూడా వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కమీషనర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకొని, పాడి రైతులకు లాభం చేకూర్చే ఆలోచన చేసిందని, అందు కోసం బల్క మిల్క్ చిల్లింగ్ కేంద్రాల కోసం రైతు భరోసా కేంద్రానికి దగ్గరగా లేదా పాల సేకరణకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. మొదటి దశ లో 17 క్లస్టర్స్ లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఆయా తసిల్దార్లు వెంటనే స్థలం ఇచ్చే పని లో ఉండాలని ఆదేశించారు. డుమా పి.డి , పంచాయత్ రాజ్ ఎస్.ఈ దీని పై దృష్టి పెట్టాలని, సంయుక్త కలెక్టర్ సంక్షేమం దీనిని పర్యవేక్షించాలని అదేసించారు.
సంయుక్త కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్ మాట్లాడుతూ టిడ్కో గృహాలను కూడా డిసెంబర్ 15 నాటికీ టెండర్ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. వాలంటీర్ లు టిడ్కో లబ్దిదారుల గృహాలకు వెళ్లి ప్రభుత్వం మంజూరి చేసిన లేఖలను అందజేయలన్నారు. డిసెంబర్ 10 నాటికీ జియో టాగింగ్ జరగాలని, లబ్దిదారు ఫోటో కూడా మాపింగ్ జరగాలని అన్నారు. సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమాలను చేయాలన్నారు.
సంయుక్త కలెక్టర్ జే.వెంకట రావు మాట్లాడుతూ జిల్లాలో వై.ఎస్.ఆర్ జల కళ క్రింద 44 వేల దరఖా స్తులు అందాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి బోర్లు, మోటర్లు అందజేయటానికి సిద్ధం చేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్ క్రింద జనవరి 1, 2021 నాటికీ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటర్లుగ నమోదు చేయాలని అన్నారు. క్లెయిమ్స్ అభ్యంతరాలను కూడా పరిష్కరించాలని, జనవరి 15 న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని అన్నారు. బి.ఎల్.ఓ ల ఖాళీలను పూరించాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అవసరాలను వెంటనే తెలియజేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డుమా , డి. ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ లు నాగేశ్వర రావు, సుబ్బా రావు, ఉప కలెక్టర్ లు బాలా త్రిపుర సుందరి, సోల్మన్ రాజు, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.