మహిళల గౌరవం, హక్కులు పరిరక్షించాలి..


Ens Balu
3
ఆంధ్రాయూనిర్శిటీ
2020-11-19 17:16:10

మహిళల గౌరవం, హక్కుల పరిక్షణకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఏయూ దుర్గాబాయి దేశముఖ్‌ ‌మహిళా అధ్యయన కేంద్రం నిర్వహించిన హ్యూమన్‌ ‌ట్రాఫికింగ్‌ ‌ప్రివెన్షన్‌ ‌మెజర్స్ ‌సదస్సును ఆయన ఆన్‌లైన్‌ ‌విధానంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు వినియోగ వస్తువు కాదన్నారు. వారికి పూర్తి బధ్రత, రక్షణ కల్పించడం మన బాధ్యతగా నిలుస్తుందన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఈ దిశగా తొలి అడుగు వేస్తూ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.   విశ్రాంత ఐపీఎస్‌ అధికారి పి.ఎం నాయర్‌ ‌మాట్లాడుతూ సామాజిక సమస్యలను పరిష్కారాలు చూపడంలో యువత ముఖ్య భూమిక పోసించాలన్నారు. కార్యక్రమానికి ఏపి మహిళా కమీషన్‌ ‌చైర్మన్‌ ‌వాసిరెడ్డి పద్మ పాల్గొని తమ సంఘీభావం వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న  చర్యలను  వివరించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, ఐజెఎం డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్ ‌మెర్లిన్‌ ‌ఫ్రిడా, ఏపి మహిళా కమీషన్‌ ‌సంచాలకులు రావూరి సూయిజ్‌, ‌స్టెల్లా మేరీస్‌ ‌కళాశాల సోషల్‌ ‌వర్క్ ‌విభాగాధిపతి సిస్టర్‌ ‌సహర మేరీ, న్యాయవాది రెహమున్నీసా బేగం, సరస్వతి అయ్యర్‌, ‌బి. రాము, కేంద్రం సంచాలకులు డాక్టర్‌ ‌పి.ఉష తదితరులు ప్రసంగించారు.