డిసెంబర్ 17 నుంచి ఐజిసి సదస్సు..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-19 17:18:31
ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వరంలో డిసెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు ఇండియన్ జియోటెక్నికల్ కాన్ఫరెన్స్ 2020 ని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. సదస్సు వివరాలతో కూడిన పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కోవిడ్ నేపధ్యంలో సదస్సును ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సదస్సును 14 విశిష్ట అంశాలపై జరుపుతున్నారు. సదస్సులో ఐఎస్‌ఎస్‌ఎంజిఇ ఉపాద్యక్షులు ఆచార్య చార్లెస్ ఎన్‌జి, కాన్‌సాస్ యూనివర్సిటీ ఆచార్యులు జి హాన్, ఓటావా వర్సిటీ ఆచార్యులు సాయి వానపల్లి, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ అద్యక్షులు ఆచార్య జి.ఎల్ శివకుమార్ బాబు తదితరులు ప్రసంగిస్తారన్నారు. సదస్సుకు 327 సాంకేతిక పరిశోధన పత్రాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఐజిఎస్ విశాఖ చాప్టర్ చైర్మన్ ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి, విభాగాధిపతి టి.వి ప్రవీణ్, ఆచార్య పి.వి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.