టిడ్కో గ్రుహాలను పరిశీలించిన కలెక్టర్..


Ens Balu
3
Prasannayanapalli
2020-11-19 17:25:40

అనంతపురం నగర పాలక సంస్థకు సంబంధించి ప్రసన్నాయనపల్లి, చిన్మయనగర్ లో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం అనంత నగర పాలక సంస్థ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి, ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి లతో కలిసి వివిధ దశలలో నిర్మితమవుతున్న గృహ నిర్మాణాలను జిల్లా కలెక్టర్  పరిశీలించారు. అక్కడి నిర్మాణాలు పరిశీలించి, టిడ్కో అధికారుల ద్వారా ఇది వరకే వివిధ దశలలో జరిగిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. గృహ నిర్మాణాలపై ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు అందిన వెంటనే గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని టిడ్కో అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడ్కో డిఈ రంగారావు,ఈఈ శ్యామ్ సుందర్,డిఎస్ మాక్స్ ఏజెన్సీకి చెందిన ఇంజినీరింగ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.