బాలల హక్కులను పరిరక్షించాలి..


Ens Balu
2
Srikakulam
2020-11-19 18:33:11

బాలల హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతీ  ఒక్కరిపైన వుందని ఐసిడిఎస్ పి.డి. జి.జయదేవి పేర్కొన్నారు.  గురువారం స్ధానిక పొట్టి శ్రీరాములు కూడలి నుండి ఏడు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ, దత్తత మాసోత్సవాలు, బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. పిల్లల దత్తత ప్రక్రియ మరియు బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించడానికే ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.   బాలల హక్కులను, వారి స్థితిగతులను ప్రజలు తెలుసుకోవాలన్నారు.  బాలల హక్కులపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించాయని తెలిపారు. విద్యా హక్కు, బాలకార్మిక చట్టం, బాల్య వివాహాలపై ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు.   14 సం.ల లోపు బాల బాలికలంతా బడులలోనే వుండాలని బాలలంతా చదువుకోవాలన్నారు.   బాలకార్మిక నిరోధ చట్టం ద్వారా బాలలను పనులలో పెట్టుకోరాదని తెలిపారు.  బాల్య వివాహాలు చేసుకోరాదని తెలిపారు. తమకు అవసరం లేని పసి కందులను చాలా మంది చెత్తబుట్టలలోను, మురికి కాలువలలోను పారివేస్తుంటారని అటువంటి పనులు చేయరాదని తెలిపారు.  తమ కార్యాలయానికి  పిల్లలను అప్పగించాలని, తాము  ఆ పిల్లలను సంరక్షించడం జరగుతుందని  తెలిపారు.   పిల్లలు లేని దంపతులకు వారిని దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  అడిషనల్ ఎస్.పి. సోమశేఖర్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, మన దేశంలో 18 కోట్ల మంది బాలలు వున్నారని తెలిపారు.  బాలల సంరక్షణకై అనేక చట్టాలను రూపొందించడం జరిగిందన్నారు.  మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దిశ చట్టం, పోస్కో చట్టం ద్వారా  పిల్లలను, మహిళలను  సంరక్షించడం జరుగుతున్నదన్నారు.                 ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.చంద్రనాయక్, అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.జగన్నాధం, డి.ఎస్.పి. మహేంద్ర, అదనపు పథక సంచాలకులు పి.రాధాకృష్ణ, అసిస్టెంట్ లేబరా కమీషనరు పురుషోత్తం, బాలల హక్కుల సంక్షేమ సమితి సభ్యులు బి.సురేశ్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, చైల్డ్ లైన్ సిబ్బంది, స్వఛ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.