నారాయణపురం ఆనకట్ట పూర్తిచేయాలి..
Ens Balu
3
Srikakulam
2020-11-19 19:31:41
శ్రీకాకుళం జిల్లాలోని నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులు, కాలువల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంబంధిత అధికారులను కోరారు. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులపై టెక్నికల్ ఎక్స్ పర్ట్ కమిటీతో శాసనసభ్యులు గురువారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపురం ఆనకట్ట, కాలువల ఆయకట్టు అభివృద్ధి పనుల కోసం జైకా నిధులు విడుదలైన సంగతిని గుర్తుచేసారు. ఆనకట్ట ఆధునీకరణ పనులపై టెక్నికల్ ఎక్స్ పర్ట్ కమిటీతో చర్చించిన అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గం కాలువ లైనింగ్ మరియు రెగ్యులేటర్ పున:నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా చేపట్టి పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో టెక్నికల్ అడ్వైజర్ రౌతు సత్యనారాయణ, సి.డి.ఓ సి.ఇ కె.శ్రీనివాసరావు, నార్త్ కోస్ట్ సి.ఇ సిహెచ్.శివరాంప్రసాద్, జైకా అడ్వైజర్, విశ్రాంత కార్యనిర్వాహక ఇంజినీర్ షాజాన్,పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమలరావు, యస్.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.