మధ్యతరగతి ఉద్యోగిణిలకు ఐసిడిఎస్ వసతి..
Ens Balu
3
Srikakulam
2020-11-19 19:43:31
శ్రీకాకుళం పట్టణం కలెక్టరేట్ సమీపంలో గల జిల్లా మహిళా శిశు అభివృధ్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుపబడుచున్న ఉద్యోగినుల వసతి గృహం నందు పేద, మధ్య తరగతికి చెందిన ఉద్యోగినులకు వసతి కల్పిస్తున్నట్టు ఐసిడిఎస్ పిడి జి.జయదేవి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చాలా మంది మహిళలు వారి స్వస్థలం నుండి పార్ట్ టైం లేదా ఉదయం పది గం.ల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేయు సందర్భంలో ఆలస్యము కావడం, లేదా కోవిడ్ -19 కారణంగా ఆర్.టి.సి. లేదా ప్రైవేటు వాహనాలు లేకపోవటం కారణంగా రాత్రి పూట వుండడానికి భద్రత లేక పోయిన కారణంగా బాధపడుతున్నందున వారికి వెసులు బాటు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఐసిడిఎస్.ఆధ్వర్యంలో నిరివహిస్తున్న వర్కింగ్ వుమెన్ హాస్టల్ లో వారికి వసతి పొందే అవకాశం కలిగించనున్నట్లు ఆమె తెలిపారు. వసతి అవసరమైన ఉద్యోగినులు వసతి కోసం దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆమె కోరారు..