శ్వేతలో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు..


Ens Balu
5
Tirupati
2020-11-19 20:22:17

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినాన్ని  పురస్కరించుకొని వారం రోజుల పాటు సహకార ఉత్సవాలు జరుపుతున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి శ్వేత భవనంలోని 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు , సహకార శిక్షణ కార్యక్రమం ఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్టాలు సహకార రంగంలో ముందు ఉన్నట్లు తెలిపారు. టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు అభివృద్ధికి  తన వంతు సహకారం అందిస్తామన్నారు.     అంతకుముందు టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు అధ్యక్షులు ముని వెంకట రెడ్డి బ్యాంకు కార్యకలాపాల గురించి తెలియజేశారు.  అనంతరం ఉప అధ్యక్షులు  శివ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సహకార రంగాల గురించి వివరించారు.  ఈ  కార్యక్రమంలో ఎంప్లాయిస్ బ్యాంకు కోశాధికారి వాసు, డైరెక్టర్లు వెంకటేష్,  కిరణ్,  హేమలత, గుణ శేఖర్, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.