21 నుంచి ఏపీపీఎస్సీ డిపార్ట్ మెంటల్ పరీక్షలు..


Ens Balu
2
తిరుపతి
2020-11-20 13:15:32

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్థుల  డెపార్ట్మెంటల్ పరీక్షలు  ఈనెల 21 నుండి 29 వరకు (మే ,2020 నోటిఫికేషన్ ) జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి మురళి  అన్నారు.  శుక్రవారం తిరుపతిల ఆర్డీఓ కార్యాలయంలో డెపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వాహణపై ఎ. పి. ఎస్. ఎస్. సి. అసిస్టెంట్ సెక్రెటరీతో కలసి డిఆర్ఓ  పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు  , లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. డి.ఆర్.ఓ. మురళి మాట్లాడుతూ ఎ. పి. పి. ఎస్. సి. డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల తేది 21 నుండి 29 వరకు 27 వ తేదీ మినహా జిల్లాలో 14 కేంద్రాలలో  జరగనున్నాయని సూచించారు. పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహణకు ముందు తరువాత కూడా సానిటేషన్ ప్రక్రియ జరిగేలా చూడాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరి మాస్కు దరించాల్సి ఉంటుందని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని సూచించారు. ఆన్ లైన్  ఎగ్జామ్  అయినందున విద్యుత్ కు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చూడాలని సూచించారు.  ఎ. పి. ఎస్. ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి అన్ని పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ పోలీస్ శాఖలు పరీక్షా   కేంద్రాలవద్ద  144 సెక్షన్ అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు.  వైద్య శాఖ సిబ్బంది అభ్యర్థులను ధర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు.  ఎ. పి. ఎస్. ఎస్. సి. అసిస్టెంట్ సెక్రెటరీ  మురళీమోహన్ మాట్లాడుతూ ప్రశాంత వాతారణంలో నిర్వహించేలా చూడాలని , అభ్యర్థులు  అర్థగంట మునుపే పరీక్షా కేంద్రాలు  చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్  టికెట్ నందు ఇచ్చిన నియమాలను పూర్తిగా చదువుకొని అర్థం చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వాహణ పూర్తిగా  సి.సి. కెమరాల నిఘాలో జరుగుతుందని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు సెంటర్లలో ప్రత్యేక గది ఏర్పాటు చేయనున్నామని సూచించారు.  తిరుపతి  ఆర్ డి ఓ    కనకనరసా రెడ్డి  పర్యవేక్షణలో ఈ  పరీక్షల నిర్వహణ  వుంటుందని తెలిపా రు.  ఈ సమీక్షలో  సి. సూపరింటెండెంట్  వాసుదేవన్,  డి. ఏ .ఓ. తిరుపతి  సురేష్ బాబు, ఎ పి పి ఎస్ సి   సెక్షన్ ఆఫీసర్  శ్రీనివాస రావు,  డి. టి. లు లోకనాథం , లక్ష్మీనారాయణ,  పరీక్షా  కేంద్రాల   చీఫ్ సూపరింటెండెంట్లు , లైజన్ అధికారులు పాల్గొన్నారు.