యువత వేగ నియంత్రణ అలవరుచకోవాలి..


Ens Balu
4
ఆర్కేబీచ్
2020-11-20 15:24:51

యువత బైకు ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధారణన చేయడంతోపాటు, ఖచ్చితంగా వేగ నియంత్రణ అలవాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడొచ్చునని వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు బి.కాంతారావు అన్నారు. శుక్రవారం విశాఖలోని ఆర్కేబీచ్ కాళీ మాత టెంపుల్ నుంచి స్పీడ్ డ్రైవింగ్, ఈవిటీజింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని  రుషికొండ వరకూ పాల్గొన్నామని చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మీడియాత మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న బైక్ ప్రమాదాలు, ఈవిటీజింగ్ వలన యువత పెడత్రోవ, ఆత్మహత్యలు చేసుకోకుండా  ఈ అవగాహన ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బైక్ నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా డ్రైవింగ్ లైసెన్సు వచ్చేంత వరకూ వారి పిల్లలకు బైక్ లు ఇవ్వకూడదన్నారు. ఈవిటీజింగ్ విషయంలో యువతను ముందు హెచ్చరించాల్సింది కూడా తల్లిదండ్రులేనని చెప్పిరు. ఈ  ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్ బి మోహన్, రాష్ట్ర కార్యదర్శులు బి జోగారావు, అర్ ప్రభాకర్ నాయుడు, ఎం సురేష్, విద్యార్థి నాయకులు సీహెచ్.క్రాంతికిరణ్, నమ్మి లక్ష్మణ్, రంజిత్,భరత్, కె ప్రసాద్,నవీన్  చైతన్య, నిషేక్,సురేష్,పాల్గొన్నారు.