వేగ నియంత్రణతోనే సురక్షిత ప్రయాణం..


Ens Balu
3
Visakhapatnam
2020-11-20 15:54:31

సురక్షిత ప్రయాణానికి వేగ నియంత్రణ ఒక్కటే మార్గమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో  స్పీడ్ డ్రైవింగ్, ఈవిటీజింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో  జర్నలిస్టుల ప్రతినిధిగా శ్రీనుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో యువతకి వేగ నింయత్రణ, ట్రాఫిక్ రూల్స్, ఈవిటీజింగ్ పై అవగాహన కల్పించడానికి హర్ష ఫౌండేషన్ చక్కటి కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినంద నీయమన్నారు. మంత్రులు, ముత్తంశెట్టి శ్రీనివాస్, కన్నబాబులు పాల్గొని యువతకు మంచి సందేశం ఇవ్వడం శుభపరిణామం అన్నారు.  ప్రస్తుతం జరుగుతున్న బైక్ ప్రమాదాలు, ఈవిటీజింగ్ వలన యువత పెడత్రోవ, ఆత్మహత్యలు చేసుకోకుండా  ఈ అవగాహన ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బైక్ నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా డ్రైవింగ్ లైసెన్సు వచ్చేంత వరకూ వారి పిల్లలకు బైక్ లు ఇవ్వకూడదన్నారు. ఈవిటీజింగ్ విషయంలో యువతను ముందు హెచ్చరించాల్సింది కూడా తల్లిదండ్రులేనని చెప్పిరు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా వాహన వేగంలో నియంత్రణ పాటించాలని శ్రీనుబాబు కోరారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీసత్యన్నారాయణ, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, వాసుపల్లి గణేష్ కుమార్, ప్రభుత్వ విప్ బి.ముత్యాలనాయుడు తదితారులు పాల్గొన్నారు.