డ్రైవింగ్ శిక్షణతో ఉపాధి అవకాశాలు..


Ens Balu
3
Srikakulam
2020-11-20 16:34:47

డ్రైవింగ్ శిక్షణతో  ఉపాధి అవకాశాలు  మెండుగా పొందవచ్చుసని డిప్యూటీ సి.టి.ఎం. వడ్డి సుందర్  తెలిపారు.  శుక్రవారం  ఆర్.టి.సి. డిపో  ఆవరణలో  ప్రజా రవాణాశాఖ ద్వారా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్ధులకు సర్టిఫికేట్లు మంజూరు చేసారు.  కార్యక్రమానికి డిప్యూటీ సి.టి.ఎం. వడ్డి సుధాకర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యువతకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రజా రవాణా శాఖ హెవీ వెహికల్  డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు.  ప్రజా రావాణా శాఖలో  మంచి నిపుణులైన డ్రైవర్ల ద్వారా డ్రైవింగ్ పై శిక్షణ నివ్వడం జరిగిందన్నారు.  డ్రైవింగ్ లో మెళుకువలు నేర్చుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం  డ్రైవర్లకు ఎక్కువ డిమాండ్ వుందన్నారు.  పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో మంచి అవకాశాలున్నాయని అన్నారు.  జలుమూరు మండలం, చల్లవాని పేట నుండి చల్లా ఆశ అనే మహిళ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందడం చాలా సంతోషదాయకమన్నారు. ఆమెను పుష్పగుఛ్ఛంతో అభినందించారు.  ఇదే స్ఫూర్తితో   మహిళలు ముందుకు రావాలన్నారు.  అనంతరం శిక్షణ పొందిన 16 మంది అభ్యర్ధులకు సర్టిఫికేటులు అందచేసారు.  అనంతరం రెండవ బ్యాచ్ ను ప్రారంభించారు. శిక్షణలో మంచి మెలుకవలు చెప్పిన వర్మకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  డివిజనల్ మేనేజరు జి.వరలక్ష్మి, 1,2 వ డిపో మేనేజర్లు వి.ప్రవీణ, టి.కవిత, మొటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివరాం గోపాల్   శిక్షణ పొందిన అభ్యర్ధులు,  తదితరులు పాల్గొన్నారు.