మినీ ట్రక్కుల కోసం దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
1
Srikakulam
2020-11-20 21:10:34

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగులైన యస్.సి ( షెడ్యూల్డు కులాలు ) యువతకు మినీ ట్రక్కుల పంపిణీకోసం దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ జిల్లాకు 69 మినీ ట్రక్కులు ( నిత్యావసర వస్తువులు రవాణా నిమిత్తం ) పంపిణీచేయుటకు నిర్ధేశించిందని చెప్పారు. స్వయం ఉపాధి పథకం క్రింద శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులై 7వ తరగతి పాసై నిరుద్యోగులైన షెడ్యూల్డు కులాలకు చెందిన యువత ( వయస్సు 21 నుండి 45 ఏళ్లలోపు ఉండాలి )కు మినీ ట్రక్కులను పంపిణీచేయడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తుదారుని తెలుపు రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, విద్యార్హతలు, మీ-సేవా కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా నెంబరుతో పాటు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత గ్రామ,వార్డు సచివాలయాలకు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, పింఛను పొందుతున్న విశ్రాంత ఉద్యోగస్తులు,  నాలుగు చక్రాల వాహనాలు కలిగినవారు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, గత ఐదేళ్లలోపు ప్రభుత్వం నుండి లబ్ధిపొందిన వారు, ప్రభుత్వ రుణములు చెల్లించుటలో మొండి బకాయిదారులు, డిఫాల్డర్లు ఈ పథకానికి అనర్హులని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.