25న గ్రంథాయ సర్వసభ్య సమావేశం..


Ens Balu
1
Srikakulam
2020-11-20 21:15:08

శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. నవంబర్ 25 ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో 2020-21 సం.నకు నూతన పుస్తకాల కొనుగోలు, శాఖా గ్రంధాలయాలకు ఫర్నిచర్ కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయాలకు కంప్యూటర్లు, ఎయిర్ కండీషనర్లు కొనుగోలు,  జిల్లా కేంద్ర గ్రంధాలయం అదనపు భవన నిర్మాణం, జిల్లా కేంద్ర గ్రంధాలయం కాంపౌండ్ వాల్ మరియు ఆమదాలవలస శాఖా గ్రంధాలయం మరామ్మతులు తదితర అంశాలపై చర్చించి ప్రతిపాదనలు పంపుటకు సభ్యుల ఆమోదం తెలియజేయుట జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.