విప్లవ జ్యోతి అల్లూరికి సముచిత స్థానం కల్పించాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-11-21 13:15:21
విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలని విశాఖ జిల్లా అల్లూరి యువజన సంఘం అధ్యక్షులు రాజాసాగి సత్యన్నారాయరాజు(కుర్రుపల్లిబాబు) అన్నారు.శనివారం విశాఖలోని ఏవిఎన్ కాలేజీలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి విశాఖలోని ఏవిఎన్ కాలేజీలో చదుకున్న గుర్తుగా తమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాలవీరభద్రరావు, ఒబ్బలరెడ్డి సుబ్రమణ్యం, ఇ.శ్రీకాంత్, అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు ఆధ్వర్యంలో గత ఏడాది విగ్రహం ఆవిష్కరించామని చెప్పారు. ఇపుడు ఆయన విగ్రహానికి తొలి వార్షికోత్సవం చేపట్టినట్టు వివరించారు. అల్లూరి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు అయిన రోజుకే ఆయనకు తెలుగు జాతి నిజమైన గౌరవం ఇచ్చినట్టు అని అన్నారు. సంఘం కార్యదర్శి కల్లేపల్లి సంతోష్ కుమార్ వర్మ మాట్లాడుతూ, ఏవిఎన్ కాలేజిలోని స్కూలు పిల్లలకు అల్లూరి విరోచిత చరిత్రను వివరించారు. స్కూలు హెచ్ ఎం క్రిష్ణవేణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ప్రపంచ వీరుడని, తెల్లవాడిని తరిమికొట్టిని మహా ధీరుడని కొనియాడారు. అనంతరం విద్యార్ధినీ, విద్యార్ధులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మిమిక్రీరాజు తదితరులు పాల్గొన్నారు.