డిపార్ట్ మెంటర్ పరీక్షలకు తొలిరోజు 92% హాజరు..
Ens Balu
2
Vizianagaram
2020-11-21 15:04:10
ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖాపరమైన మొదటి రోజు ఉదయం సెక్షన్ పరీక్షకు 92 శాతం మంది హాజరైనట్టు కో - ఆర్డినేటింగ్ అధికారి, డి.ఆర్.వో. ఎం.గణపతిరావు చెప్పారు. ఉదయం సెక్షన్ పరీక్షకు 791 మంది రావాల్సి ఉండగా.. 727 మంది హాజరైనట్టు వివరించారు. పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి 29 వరకు జరగనున్నాయని దానికి తగ్గ ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా చేశామని పేర్కొన్నారు. మొదటి రోజు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించేందుకు గాజులరేగ లో ఉన్న సీతం ఇంజినీరింగ్ కళాశాలను ఆయన శనివారం సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అభ్యర్థులెవరూ మాస్ కాపీయింగ్ కి పాల్పడకుండా జాగ్రత్త వహించాలని లైజెనింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట లైజెనింగ్ అధికారులు, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఉన్నారు.