అనంతలో రూ.కోటితో ఆక్వా హబ్ ఏర్పాటు..


Ens Balu
2
కలెక్టరేట్
2020-11-21 15:17:09

అనంతపురం జిల్లాలో కోటి రూపాయలతో ఆక్వా హబ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భముగా శనివారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి   రాష్ట్ర ముఖ్య మంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి   నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించేందుకు రాష్ట్రంలో  25 ఆక్వా హుబ్బుల ఏర్పాటుకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతపురము నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా ఆక్వా హబ్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాద వశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.  వీడియో కాన్ఫరెన్సులో   ఉప మత్స్య సంచాలకులు శాంతి,  రాష్ట్ర బి.సి.కార్పొరేషన్ డైరెక్టర్లు  అశ్వర్ధ్ నారాయణ , లక్ష్మి నారాయణ,  రమణ, జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు  పోతన్న, బెస్త ఉపాధ్యక్షుడు కుళ్ళాయప్ప   తదితరులు పాల్గొన్నారు.