ఎస్సీ యువతకు ఉచిత ఉపాది శిక్షణ..
Ens Balu
2
Vizianagaram
2020-11-21 15:43:11
విజయవాడలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ & హెడ్ చింతా శేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)సౌజన్యంతో 6 నెలల వ్యవధితో కూడిన మెషిన్ ఆపరేటర్ – ప్లాస్టిక్స్ ప్రాసెస్సింగ్ (Machine Operator – Plastics Processing) అనే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం ద్వారా 90 మంది ఎస్సీ నిరుద్యోగ యువతకు అందిస్తున్నామన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలను, Apron, Safety Shoes, Training Kit లను CIPET అందిస్తున్నదని, 6 నెలల శిక్షణకు గాను నెలకు రూ.500/- చొప్పున మొత్తం రూ. 3,000/- ప్రోత్సాహక స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. 18 – 30 సం.లు. మధ్య వయస్సు కలిగి, 10 వ తరగతి/ I.T.I. / Diploma పాస్ (లేక) ఫెయిల్ విద్యార్హత గల నిరుద్యోగ SC యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత శిక్షణ అనంతరం అభ్యర్ధులకు CIPET సర్టిఫికేట్ తో పాటుగా ప్లాస్టిక్స్ మరియు అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశం అందిస్తామని చెప్పారు. అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్ధులు తమ ఒరిజినల్ విద్యార్హత, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఆధార్, వైట్ రేషన్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీలు మరియు 4 పాస్పోర్టు సైజు ఫొటోలతో తేది. 23.11.2020, సోమవారం నుంచి CIPET విజయవాడ కార్యాలయంలో సంప్రదిన్చాలన్నారు. మరిన్ని వివరాలకు CIPET ప్రతినిధులను 9849263296, 9985941979 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.