మంత్రివర్యా దళితవాడ దాహార్తిని తీర్చండి..
Ens Balu
3
Srikakulam
2020-11-21 16:11:01
శ్రీకాకుళంలోని దళితవాడకి త్రాగునీరు ఇప్పించాలని కోరుతూ తైక్వాండో శ్రీను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ను కలిసి వినతిపత్రం అందజేసారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తోటపాలెంలోని ఎస్.సి కాలనీకి చెందిన ప్రజలు,మహిళలు,యువతతో కలిసి డిప్యూటీ సి.ఎం వద్ద దళితుల సమస్యలను వివరించారు. వినతిని స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సానుకూలంగా స్పందించారు.ఎస్.సి కాలనీకి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని మహిళలు,యువతకి హామినిచ్చారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నివాస్ తో మాట్లాడి తోటపాలెంలోగల ఎస్.సి కాలనీకి మంచినీరు అందేలా చూస్తానని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఎఐమ్ సైనిక్ ప్రధాన కార్యదర్శి పెయ్యిల చంటితో పాటు ,డివిజన్ కార్యదర్శి ఆనంద్ కుమార్ తో పాటు తోటపాలెం ఎఐమ్ కమిటి సభ్యులు మోహన్, రామారావు, రమణ, శివ, నాయుడు, రాజు, రాధ, రమణమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.