మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ కు ఘనసత్కారం..
Ens Balu
6
కలెక్టరేట్
2020-11-21 17:17:42
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ మైలపల్లి నరసింహులు ను ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. శనివారం విజయనగరం జిల్లా కలెక్టర్ డా.జవహర్ లాల్ తో పాటు శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు,శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, మత్స్య శాఖ ఉప సంచాలకులు నిర్మలా కుమారి, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షులు బర్రి చిన్న అప్పన్న, మక్కువ ఆక్వా రైతుల మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వై. గోపాల కృష్ణ, మహిళా సంఘాల ప్రతినిధులు పుష్ప గుచ్చాలతో, శాలువాలతో సన్మానించారు. మత్స్యకారులకు మేలు జరిగేలా కష్టపడి పని చేయాలని శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాడు డైరెక్టర్ ను కోరారు.