విశాఖలో rtc complex లో ఫిష్ కియోస్క్..
Ens Balu
2
Rtc Complex Vizag
2020-11-21 17:58:03
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా 4 ఫిషింగ్ హార్బర్లు , 25 ఆక్వా హబ్ ల నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్దికి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించ నున్నదని తెలిపారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా నుంచి ఆర్.టి. సి. కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ కియోస్క్ యూనిట్ దగ్గర నుంచి వీడియో కాన్పరెన్స్ లో జిల్లా ఇన్ చార్జి మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ యం.వేణుగోపాల్ రెడ్డి , ఆర్.డి.ఒ. పి.కిషోర్ , మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఫణిప్రకాశ్, ఉప సంచాలకులు లక్ష్మణరావు, లబ్దిదారులు చెన్నా ధనలక్ష్మి, సురాడ అపర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్.టి.సి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ కియోస్క్ ను జిల్లా ఇన్ చార్జి మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ , శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.