దేవుళ్లంతా ఏకమై కరోనాని తరిమికొట్టాలి..
Ens Balu
2
ఆదర్శనగర్
2020-11-21 18:13:48
విశాఖలోని ఆదర్శనగర్ శ్రీ శ్రీ శ్రీ సిద్ధి శ్రీకృష్ణ దత్తాత్రేయ సుబ్రహ్మణ్యేశ్వర పంచముఖ ఆంజనేయస్వామి సహిత షిరిడి సాయినాధుల ఆశీస్సులతో కరోనా పూర్తిస్థాయిలో రూపుమాసిపోవాలని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షలు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆలయ 19 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అందరు దేవుళ్ల ఒకే చోటఉండి ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారని అన్నారు. ఆలయ వార్షికోత్సవర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందన్న వంశీ కరోనా సమసిపోతే జనజీవనాకి పనులు దొరికి జీవితాలు కూడు, గూడు దొరుకుతాయన్నారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయకమిటీ ప్రత్యేక జ్ఞాపకను అందజేశారు. కార్యక్రమంలో శ్రీ సిద్ధి ,శ్రీకృష్ణ సేవాసమితి కమిటీ వారు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.