రాష్ట్రపతి పర్యటను బందోబస్తు పక్కాగా ఉండాలి..


Ens Balu
3
Tirupati
2020-11-21 18:54:15

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఈ నెల 24 న జిల్లా పర్యటన సంధర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త సూచించారు. శనివారం మద్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఇంటలిజెన్స్ ఐ జి శశిధర్ రెడ్డి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కలసి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ వివరిస్తూ గౌ. భారత రాష్ట్రపతి పర్యటన సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రజాప్రతినిధులు స్వాగతం పలకనున్నారని విమానాశ్రయంలో ఏర్పాట్లను జెసి (సంక్షేమం) రాజశేఖర్, ఎ. పి. డి. సురేష్, సి. ఎస్. ఓ. రాజశేఖర రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్ల    కలసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి భారత   రాష్ట్రపతి పర్యటన పూర్తి సమన్వయ అధికారిగా వ్యవహరించాలని  తెలిపారు. ఆర్ అండ్ బి , పంచాయితీరాజ్ రోడ్డు మరమ్మత్తులు, పరిసరాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వైద్య శాఖ రాష్ట్రపతి పర్యటనలో  విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తప్పనిసరి కోవిడ్ పరీక్షలు (రాపిడ్) టెస్టులు నిర్వహించాలని సూచించారు. అనంతరం విమానాశ్రయం నుండి రాష్ట్రపతి పర్యటించనున్న   ప్రదేశాలను ముందస్తు వాహనశ్రేణి ద్వారా   రోడ్డు మార్గం పరిశీలిస్తూ, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్,   శ్రీవారి ఆలయం వద్ద పరిశీలించారు.  ఈ సమీక్ష, పర్యటనలో టి.టి.డి సి.వి. అండ్ ఎస్. ఓ. గోపినాథ్ జెట్టి, ఆర్డీఓ కనకనరసారెడ్డి, ఎస్. బి. డి ఎస్. బి. గంగయ్య, రాష్ట్రపతి పర్యటన విధులు కేటాయించిన అధికారులు, విమానాశ్రయ అధికారులు శ్యామ్ , సెక్యూరిటీ అధికారులు   పాల్గొన్నారు.