మాస్కులు లేకుండా అనుమతిస్తే కఠిన చర్యలు..


Ens Balu
1
Visakhapatnam
2020-11-21 21:07:42

మాస్కులు లేకుండా వినియోగ దారులను, సిబ్బందిని  అనుమతిస్తే హోటల్స్ మూయిస్తామని  జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు హెచ్చరించారు. ఆయన క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శనివారం ఐదవ జోన్ లోని 60, 63, 64 వార్డులలోని ఆటోనగర్, సాయిరాం నగర్, కణితి రోడ్డు, అప్పన్నపాలెం, హై స్కూల్ రోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక హోటల్స్ లను సందర్శించి మాస్కులు లేకుండా ఉన్న హోటల్ సిబ్బంది మరియు వినియోగదారులను గమనించి ఆయా హోటల్స్ లకు ఫైన్లు వేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ, జివిఎంసి సిబ్బందికి తడి-పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలనిసూచించారు.తడి-పొడి చెత్త వేరు వేరుగా ఇస్తున్నారా? డోర్ టు డోర్ చెత్త కలక్షన్ చేస్తునారా ? అని స్వయంగా స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  పారిశుద్ధ్య కార్మికులు కాలువల నుండి చెత్తను తొలగించడం, యు.జి.డి. బ్లాకులను శుభ్రపరచడం మొదలైన పనులను  పరిశీలించారు. తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. పారిశుద్ధ్యంపై అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాస్కులు, గ్లౌజులు ధరించని కార్మీకులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలన్నారు. వార్డు శానిటరీ కార్యదర్శులను ప్రశ్నిస్తూ, సీజనల్ వ్యాదులపై ప్రతీ రోజూ తనిఖీ చేస్తున్నారో  లేదో అడిగి తెలుసుకున్నారు. రోజుకు నిర్దేశించిన విధంగా ఇళ్లను సందర్శించి ప్రజలకు విష జ్వరాలపై  అవగాహన కలిగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయా వార్డు శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.