కొత్తపనులను పక్కాగా చేపట్టాలి..


Ens Balu
2
Anantapur
2020-11-21 21:11:02

అనంతపురం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి,రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు  శంకుస్థాపనలు చేయనున్న  కార్యక్రమాలకు  సంబంధించిన పనులను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ,జాయింట్ కలెక్టర్ డా.ఏ. సిరి లతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు  బొత్స సత్యనారాయణ గారిచే ఈ నెల 23వ తేదీన  శంకుస్థాపనలు చేయనున్న ప్రదేశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  స్థానిక  ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 30 పడకల స్థాయి నుండి 50 పడకల స్థాయికి పెంచనున్న స్థలాన్ని  పరిశీలించి శంకుస్థాపన ఏర్పాట్లపై అధికారులకు పలుసూచనలు జారీ చేశారు.అనంతరం స్థానిక కుమ్మర వీధిలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించే పనులు,అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా కళ్యాణ దుర్గం నియోజక వర్గంలోని ఐదు మండలాలకు ఇంటింటికి త్రాగునీరు అందించే కార్యక్రమాల శంకుస్థాపన పనులపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీచేశారు.ఈ పనులన్నీ  ఆదివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలన్నారు.అనంతరం బహిరంగ సమావేశం నిర్వహించే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ రామ్మోహన్,ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ హరేరామ్ నాయక్,డిఎంహెచ్ఓ డా.కామేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డా.రమేష్ నాధ్,పీఆర్ ఎస్ఈ మహేశ్వరయ్య,పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాధ్ రెడ్డి,ఈఈ సతీష్ చంద్ర ,డీఈఈ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.