విశాఖ స్టీల్ కి పోస్కో వరమా..శాపమా..?


Ens Balu
3
CITU office
2020-11-22 11:08:29

పోస్కో బూన్‌ ఆర్‌ ‌బ్యాన్‌ (‌పోస్కో వరమా? శాపమా?) అనే ఇంగ్లీష్‌ ‌పుస్తకాన్ని సెంటూరియన్‌ ‌యూనివర్సిటీ వైస్‌ ‌ఛాన్స్‌లర్‌ ‌  ఆచార్య ‌జిఎస్‌ఎన్‌ ‌రాజు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య రాజు మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని స్టీల్‌ప్లాంట్‌ ‌నిర్మాణం నుంచి అనుభవం గడించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ ‌నరగసింగరావు ఈ పుస్తకాన్ని రచించిండం, దానిని సిఐటియు విశాఖ నగర కమిటీ ముద్రించడం అభినందనీయమన్నారు. నవంబర్‌ 26‌న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె సందర్భంగా ఈ పుస్తకం విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను  దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’ కంపెనీతో జాయింట్‌ ‌వెంచర్‌గా  తేది.23-8-2020న ఒప్పందం చేసింది. ఈ జాయింట్‌ ‌వెంచర్‌ ‌కంపెనీ 5 మిలియన్‌ ‌టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేయడానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌స్థలం కేటాయించింది. దీని పెట్టుబడి రూ. 30వేల కోట్లలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌కనీసం రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇప్పటికే రూ.3వేల కోట్ల నష్టాలో వున్న విశాఖ స్టీల్‌ను పూర్తిగా అప్పులపాలు చేసి పోస్కోకు కట్టబెట్టాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిశ్రమలకు సొంత ఇనుప ఖనిజం గనులున్నాయి. ప్రైవేట్‌కు అప్పగించడం కోసమే గతంలో కాంగ్రెస్‌ ‌గాని నేడు బిజెపి గాని క్యాప్టివ్‌ ‌మైన్స్‌ను కేటాయించలేదు. దీనివల్ల ప్రతి సంవత్సరం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 2వేల కోట్లు అదనంగా ఖర్చవుతున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌నష్టం రావడానికి ఇదే ప్రధానమైన కారణం. తేది.5-4-2018న స్టీల్‌ప్లాంట్‌ ‌గనుల కోసం సిఐటియు వైజాగ్‌ ‌స్టీల్‌ ‌మార్చ్ ‌నిర్వహించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 32 ‌మంది ప్రాణాల బలిదానంతో పోరాడి సాధించుకున్న భారీ ప్రభుత్వరంగ పరిశ్రమ. సముద్రతీరంనున్న అత్యంత నాణ్యమైన స్టీల్‌ ఉత్పత్తి పరిశ్రమ ఇది అన్నారు. ప్లాంటు ప్రారంభంలో రూ.5వేల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు సమకూర్చింది. కాని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.40,303 కోట్లు పన్నులు, డివిడెండ్లు చెల్లించింది. సొంత నిధులతో 1.2 మిలియన్‌ ‌టన్నుల నుంచి 7.3 మిలియన్‌ ‌టన్నుల సామర్ధ్యానికి విస్తరించింది.  రాష్ట్రంలోనే 30వేల మంది ప్రత్యక్ష్యంగాను, లక్ష మంది పరోక్షంగాను ఉపాధి పొందిన ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్‌. అలాంటి సంస్థ పోస్కో వలన ప్రైవేటు పరం కావడంపై మంచి విషయాలను తెలియజేస్తూ పుస్తకాన్ని తీసుకురావడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో.. కెఎం కుమార మంగళం, ఎన్.జ్యోతీశ్వరరావు, ఆర్కేఎన్వీకుమార్, ఎం.జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు..