24 రాష్ట్రపతి పర్యటన..ట్రాఫిక్ మళ్లింపు..


Ens Balu
1
Tirupati
2020-11-22 14:56:12

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ తిరుమల, తిరుపతి పర్యటన సందర్బంగా 24వ తేదిన ట్రాఫిక్ మళ్లింపు ప్రక్రియ చేపట్టినట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలియజేశారు.  * తేదీ 24.11.2020 ఉదయం 10:00 గంటల నుంచి 11-45 గంటల వరకు మరల 3.00 గంటల నుండి 4.00 గంటల వరుకు బస్టాండ్ నుంచి తిరుమల వైపు , ఇతర ప్రదేశములకు పోవు బస్సులను వి.‌వి.‌ఐ‌.పి దారి కాకుండా వేరే దారిలో మళ్లిస్తున్నాం.. * ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు వరకు కడప, శ్రీకాలహస్తి, నెల్లూరు, విజయవాడ, నగిరి, పుత్తూర్. చెన్నై నుంచి వచ్చి, పోయే వాహనములను పాత రేణిగుంట, కరకంబాడి రొడ్లగుండా తిరుపతిలోకి , బయటకు అనుమతిస్తాం. *  మదనపల్లి, పీలేరు, వేలూరు, చిత్తూర్ నుండి వచ్చు మరియు పోవు  వాహనములను చెర్లోపల్లి క్రాస్, జూపార్క్, గరుడ సర్కిల్ మరియు  లీలా మహల్ మీదుగా తిరుపతి బస్స్టాండ్ లోనికి , బయటకు  అనుమతిస్తారు. * చంద్రగిరి, రంగంపేట, చెర్లోపల్లే, శ్రీనివాసమంగాపురము నుండి వచ్చు షేర్ ఆటొలు  చెర్లోపల్లి క్రాస్, జూపార్క్, గరుడ సర్కిల్ మరియు  లీలా మహల్ మీదుగా తిరుపతి పట్టణము లోనికి మరియు బయటకు అనుమతిస్తారు. * తదుపరి ఉదయం నుంచి పర్యటన ముగింపు వరకు రాష్ట్రపతిపర్యటన చేయు మార్గము  అనగా రామానుజ పల్లి కూడలి నుంచి అలిపిరి వరకు  ఇరువైపుల గల దుకాణాదారులు దుకాణాల ముందు ఏవరినీ ఉంచారాదు, ఎటువంటి వాహనాలను అనుమతించరు * వి.ఐ.పి  ప్రయాణించు మార్గము ఇరువైపుల ఫుట్ పాత్, రోడ్డు ఇరువైపుల ఎలాంటి వాహనాలు, వస్తువులు ఇతరములు ఏది  ఉంచరాదు.  * అత్యవసర వాహనములు అనగా అంబులెన్సు, అగ్నిమాపక వాహనములకు మళ్లింపులు నుంచి మినహాయింపు ఇచ్చామని తెలియజేశారు.