శంఖవరం మండలంలో 47కి చేరిన కరోనా కేసులు..
Ens Balu
2
Sankhavaram
2020-07-29 14:24:13
శంఖవరం మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ ల సంఖ్య 47కి చేరుకుందని పీహెచ్సీ వైద్యాధికారి ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శంఖవరంలో 22, మండపంలో 4, పి.చామవరం1, స్రుంగవరం9, బంగారయ్యపేట1, గిడిజాం1, రౌతులపూడిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు చేయనున్నట్టు చెప్పారు. వైరస్ కేసులు అధికంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రాకూడదన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు, తరచుగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సబ్బుతో చేతులు కడుక్కోవాలన్నారు. పాజిటివ్ వచ్చినవారందరికీ హోమ్ ఐసోలేషన్ ద్వారా చికత్స అందిస్తున్నట్టు డాక్టర్ వివరించారు. మరోవైపు కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది..