తుంగభద్రలో స్వాత్మాంనందేంద్ర సరస్వతి పూజలు..
Ens Balu
2
Tungabhadra
2020-11-23 15:01:16
తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా సోమవారం సంకల్ బాగ్ పుష్కరఘాట్ లో విశాఖ శ్రీ శారదా పీఘం ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మాంనందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాత్మాంతందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూల జరిగి ప్రజలు శుభిక్షంగా ఉండాలని తాను కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం నదీపూజలు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం తుంగభద్ర పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేసిందని స్వామీజి కితాబు నిచ్చారు. పుష్కరాల్లో స్నానాలు ఆచరించి పిత్రుదేవతలకు పిండ ప్రధానం చేయడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరి, వారి బిడ్డల రుణం తీరుతుందని స్వామీజి వివరించారు. స్వామివారు రాక సందర్భంగా కర్నూలు జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. స్వామీజీకి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డా.జె. సుధాకర్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు స్వామి వారికి స్వాగతం పలికారు.