శివనామస్మరణతో భీమేశ్వరాలయం..


Ens Balu
2
Samarlakota
2020-11-23 11:48:24

భీమేశ్వరాలయం శివనామస్మరణతో మారుమోగి పోయింది.. కార్తీకమాసం రెండవ సోమవారం, మహా పర్వదినం కావడంతో పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు కొంతేటి జోగారావు, సోమేశ్వరశర్మ, రాంబాబు, వెంకన్నలు ముందుగా గోపూజలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వరస్వామికి జరిగిన తొలి అభిషేక పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం బాలాత్రిపురసుందరీ అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజలు చేశారు. విశేష పూజలు అనంతరం స్వామి వారిని, అమ్మవారిని నూతన పట్టుబట్టలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లా నలుమూలాల నుంచి కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవ్వగా కోవిడ్ నిబంధనలు ఆమలు చేస్తూ దేవాదాయ సిబ్బంది భక్తులను దర్శనాలు అనుమతించారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్యూ 100 మంది పాలీసులు, 29 మంది హోంగార్డులతో బందోబస్తు చర్యలు నిర్వహించారు.