శ్రీకాకుళం స్పందనకు 101 వినతులు..
Ens Balu
2
Srikakulam
2020-11-23 15:30:38
శ్రీకాకుళం జిల్లాలోని కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 101 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం లో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ విన్నపాలు తెలియజేశారన్నారు. వాటన్నింటిని వివిధ విభాగాలు, శాఖలకు బదిలీల చేసి వారం రోజుల్లోగా వాటికి పరిష్కార మార్గాలు చూపించాలని అధికారులను ఆదేశించినట్టు డిఆర్వో తెలియజేశారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోనులోనే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నారు. స్పందర దరఖాస్తుల విషయంలో ఏ ఒక్కరు అలసత్వం వహించినా వారిపై చర్యలు తీసుకుంటామని డిఆర్వో హెచ్చరించారు.