సత్యసాయి ఫౌండేషన్ సేవలు చిరస్మరణీయం..
Ens Balu
3
Ananthagiri
2020-11-23 15:46:22
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జయంతిని పురష్కరించుకొని విశాఖ శ్రీ సత్యసాయి బాబా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన్యంలోని 10 గిరిజన గ్రామాల్లో 550 కుటుంబాల గిరిజనులకు బిందెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంతగిరిలో సత్యసాయి సభ్యులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఈ పంపిణీ జరిగింది. అటు విశాఖలోని కెజిహెచ్ లో 100 గర్భిణీ స్త్రీలకు చీరలు, బిస్కెట్లు సూపరింటెండెంట్ డా.మైధిలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సత్యసాయి జయంతిని రోగులకు సేవలు చేయడానికి వినియోగించడం చాలా ఆనందంగా వుందన్నారు. ఆ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ద్వారా రోగులకు సేవలు చేసే అవకాశ దక్కిందన్నారు. కార్యక్రమంలో సాయిడివోటీలు పాల్గొన్నారు.