రూ.160.55 కోట్ల అభివ్రుద్ధి పనులకు శంఖుస్థాపన..
Ens Balu
1
Kalyandurga
2020-11-23 16:28:43
అనంతపురంట జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో రూ.160.55 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు మునిసిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ శంకుస్థాపనలు చేశారు. సోమవారం ఉదయం కల్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ,స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి ఉషాశ్రీ చరణ్,జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భూమిపూజ, శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూడుకోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 పడకల నుండి 50 పడకల ఆసుపత్రి స్థాయి కి పెంపుచేస్తూ నిర్మించనున్న సందర్భంగా నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మంత్రులు భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిలాపలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కళ్యాణదుర్గం పట్టణంలో జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.1952.90 లక్షల వ్యయంతో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికి కుళాయిల సౌకర్యం కల్పించనున్న పథకానికి,రూ.138.02 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణదుర్గం పట్టణ సమగ్ర త్రాగు నీటి సరఫరా పథకాలకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాలను మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, కదిరి,మడకశిర ఎమ్మెల్యేలు డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి,పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, కళ్యాణదుర్గం ఆర్డీఓ రామ్మోహన్,ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ హరేరామ్ నాయక్,డిఎంహెచ్ఓ డా.కామేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డా.రమేష్ నాధ్,పీఆర్ ఎస్ఈ మహేశ్వరయ్య,పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాధ్ రెడ్డి,ఈఈ సతీష్ చంద్ర ,డీఈఈ సూర్యనారాయణ ,అధికారులు,ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.