వైఎస్సార్ పై తప్పుగా మాట్లాడి వుంటే క్షమించండి..


Ens Balu
2
కుకట్ పల్లి
2020-11-23 16:35:47

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక్కరోజులోనే అదే స్థాయిలోనే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్ లో దివంగత నేత వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ అభిమానులకు  తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అదే సమయంలో వైఎస్సార్‌పై రాఘునందన్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు సోషల్‌ మీడియా వేదికగా మహానేత అభిమానులు భగ్గుమంటూ స్పందించారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ వైఎస్సార్‌ పట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పారు. దానికి ముందు..ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించిన నేపథ్యంలో చెప్పిన క్షమాపణలు కూడా అటు బీజేపీలోనూ, ఇటు సోషల్ మాద్యమాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. రఘునందన్‌ వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌ అభిమానులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా పెను దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు స్పందించారు. వైఎస్సార్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. వైఎస్సార్‌ అభిమానుల మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసేన సేవలు ఎంతో గొప్పవని, వాటిపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడాలని, అదే సమయంలో వైఎస్సార్ అభిమానుల ఆగ్రహానికి ఎందుకు గురి అయి ఎందుకుక్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో అంతా కౌంటర్లు వేయడం కొనసాగుతోంది..