ప్రభుత్వ భూ ఆక్రమితులపై చర్యలు తీసుకోవాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-11-23 16:44:44

విశాఖజిల్లాలో స్వాతంత్ర సమరయోధులు,  మాజీ సైనిక ఉద్యోగుల భూములకు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలపై  పూర్తి స్థాయి విచారణ జరపాలని  జనసేన నాయకులు  పీతల మూర్తి యాదవ్  సిట్  ఉన్నతాధికారి డాక్టర్ విజయ్ కుమార్ నో కోరారు.  విశాఖలో జరిగిన భూ అవకతవకలకు  సంబంధించిన పలు అంశాలతో  సిట్ కు లేఖ ఆయన సోమవారం ఒక లేఖ రాశారు.  అక్రమాలు జరిగిన భూమిలన్నింటిని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని  మూర్తి యాదవ్ కోరారు.   నిబంధనలకు విరుద్ధంగా  ప్రైవేటు వ్యక్తుల పరమైన దసపల్లా భూముల  రిజిస్ట్రేషన్ లను రద్దుచేసి  వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.  గతంలో బయటపడిన ఉడా భూముల కుంభకోణానికి సంబంధించి  అప్పటి వీసీ కోన శశిధర్ ఇచ్చిన నివేదికను  తిరిగి పరిశీలించాలని,  ఆ నివేదికలో పేర్కొన్న ఐదు వందల నలభై కోట్ల రూపాయల అక్రమాలు సంబంధించిన భూములను, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.  అక్రమాలకు మారుపేరుగా మారిన ఉడా ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలను బహిర్గతం చేయాలని,   జి వి ఎం సి పరిధిలో మంజూరైన టిడిఆర్  సర్టిఫికెట్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి అన్నారు.  ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా  కార్యక్రమాలు చేపడుతున్న సినారె బీచ్ రిసార్ట్,  హైగ్రీవ,  బే పార్క్,  కార్తీక వనం,  మూన్ ల్యాండ్  లకు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.  అటవీశాఖ,  తీరప్రాంత, యు ఎల్ సి మిగులు భూములను సిట్ పరిధిలో  చేర్చి  అందులోని అక్రమాలపై విచారణ జరపాలన్నారు.  మెడిటెక్ పార్క్ భూసేకరణలో అక్రమాలకు పాల్పడిన వారిపై  తీసుకోవాలని,  ముదపాక దళితులకు చెందిన భూములను  బలవంతంగా లాక్కొని కూడా ల్యాండ్  పూలింగ్ కు ఇచ్చినట్లు ఫిర్యాదులు ఉన్నాయని  తెలిపారు.  అన్ని రకాల భూ లావాదేవీలలో  అవినీతి అక్రమాలకు పాల్పడిన  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ, ఉడా పరిధిలోని  10 శాతం ఓపెన్ స్పేస్ స్థలాలను,  పార్కులను గుర్తించి కాపాడాలన్నారు.  గత ప్రభుత్వ హయాంలోని  సిట్ నివేదికను  తాజా సిట్ నివేదికతో పాటు బహిర్గతం చేయాలన్నారు.