నగరిలో స్కూళ్లకు శానిటైజర్ గొడుగులు..
Ens Balu
2
Nagari
2020-11-23 17:25:39
పిల్లలు దేవుడితో సమామని అలాంటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నగిరి ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పి.సి.ఎన్. హైస్కూల్, నగరి, జెడ్.పి.బాలికల ఉన్నత పాఠశాల, పుత్తూరు, జెడ్.పి. బాలుర ఉన్నతపాఠశాల, వడమాలపేట, జెడ్.పి.ఉన్నతపాఠశాల, నిండ్ర, జెడ్.పి.ఉన్నత పాఠశాల, విజయపురం లకు శానిటైజర్ గొడుగులను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పాఠశాలు తెరిచిన సమయంలో వారికి వైరస్ సోకకుండా ఈ గొడుగు శానిటైజర్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మంచి ఆలోచనతో శానిటైజర్ గొడుగు సృష్టికర్త, తడుకు ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ భానుప్రసాద్ తన వద్దకు రావడంతో వాటిని పాఠశాలలకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్టు రోజా వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎం.ఇ.ఓ లు శ్రీదేవి, తిరుమల రాజు, పద్మావతి, నారాయణ, ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు మనోహరి, సునీత, భువనేశ్వరి,దొరస్వామి, గీతాకుమారి తదితరులు పాల్గొన్నారు.