డిసెంబరు 8నుంచి యువజనోత్సవాలు..
Ens Balu
3
Srikakulam
2020-11-23 19:49:15
శ్రీకాకుళం జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను డిసెంబర్ 8 నుంచి 11 వరకు స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. 27అంశాల్లో సాంస్కృతిక పోటీలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 15 సం.ల నుండి 29 సం.ల వయస్సు కలిగిన యువతి యువకులు ఈ పోటీలకు అర్హులని, గత మూడేళ్లలో జాతీయ స్థాయిలో పాల్గొన్నవారు ఈ పోటీలలో పాల్గొనుటకు అనర్హులని వివరించారు. పోటీల్లో పాల్గొనదలచిన యువ కళాకారులు వారి దరఖాస్తును సెట్ శ్రీ కార్యాలయపు మెయిల్ setsrisklm@gmail.com నకు సమర్పించాలని కోరారు. బారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు సంబందించిన విషయాలపైనే పోటీలలో ప్రదర్శించాల్సి ఉంటుందని, సినిమా పాటలు అనుమతించబడవని ఆయన స్పష్టం చేసారు.