పటిష్టంగా ఇంటింటికీ సరుకులు పంపిణీ..
Ens Balu
2
Srikakulam
2020-11-23 20:01:38
ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా నిర్వహించాలని సివిల్ సప్లైస్ కమీషనరు కోన శశిధర్ తెలిపారు. సోమవారం సివిల్ సప్లైస్ కమీషనరు కోన శశిధర్, సంయుక్త కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటికీ రేషన్ సరకులను పంపిణీ చేసే కార్యక్రమం పటిష్టవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఇందు నిమిత్తం యుధ్ధ ప్రాతిపదికన మ్యాపింగ్ చేయాలన్నారు. మంగళ వారం సాయంత్రంలోగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. వాలంటీర్ల లాగిన్ ద్వారా ఇ.కె.వై.సి, మ్యాపింగ్ లను పూర్తి చేయాలని తెలిపారు. డోర్ డెలివరీ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకం కలుగరాదన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దారులు, ప్రత్యేక శ్రధ్ధ వహించాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలను సిధ్ధం చేయాలని తెలిపారు. సంయుక్త కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై చేపడుతున్న చర్యలను కమీషనరు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి కిశోర్, పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ, అసిస్టెంట్ సివిల్ సప్లైస్ అధికారులు వంశీకృష్ణ, ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.