వ్యాధులు ప్రభలకుండా చూడాలి..


Ens Balu
3
GVMC office
2020-11-23 20:31:40

జివిఎంసి పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలు కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం, జివిఎంసి సమావేశ మందిరంలో సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, బయాలజిస్ట్ పైడిరాజుతో కలసి సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీతాకాలంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుకుండా తగు ముందస్తు జాగ్రత్తలు  చేపట్టాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై పర్యవేక్షించేందుకు వార్డు ప్రత్యేకాదికారులు, మలేరియా ఇన్ స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, సచివాలయ శానిటరీ కార్యదర్శులు తదితరులు నిత్యం తగు చర్యలు చేపట్టాలని, మలేరియా, డెంగ్యూ వ్యాధులకు ముఖ్య కారకాలైన దోమలు వృద్ధి చెందకుండా, నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. వారంలో ఒక రోజు ఆదివారం “డ్రై డే” గా పాటించేవిధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి కరపత్రాలు, స్టిక్కర్లు వంటివి అంటించి ముఖ్యంగా మహిళలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. అలసత్వం వహించే సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, బయాలజిస్ట్ పైడిరాజు, అన్ని జోన్ల మలేరియా ఇన్ స్పెక్టర్లు, మలేరియా సూపెర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.