భీమేశ్వరుడిని దర్శించిన డిప్యూటీ సీఎం..


Ens Balu
2
Samarlakota
2020-11-24 10:25:18

ఆ పరమశివుని దయతో కరోనా వైరస్ పూర్తిగా సమసిపోయి ప్రజలు శుభిక్షంగా ఉండాలని శివుడుని కోరినట్టు డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్ చెప్పారు. మంగళవారం పంచారామాలలో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని కుమారభీమారామము క్షేత్రాన్ని సందర్శించి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అంతరం 14 అడుగుల ఎత్తైన శివలింగానికి రెండవ అంతస్తులో కి వెళ్లి మంత్రి పూజలు చేశారు. తరువాత డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఇక్కడి శివుడిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయం మొక్ విశిష్టతలను మంత్రికి వివరించారు. ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలా త్రిపురసుందరిగా పూజలు అందుకుంటోందని. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయని, దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయని క్షేత్ర  పురాణం, దాని మహత్యం గురించి డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ కి వివరించారు.