కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్..ప్రభుత్వ ఆదేశాలు
Ens Balu
4
Srikakulam
2020-07-29 14:59:53
బక్రీద్ పండగను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మసీదులు, ఈద్గాలలో చేసుకోవచ్చని జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి ఎం.అన్నపూర్ణమ్మ తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆగష్టు 1వ తేదీన బక్రీద్ పండగ ఉందని, బక్రీద్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అనుసరించి నిర్వహించుకోవాలని ఆమె స్పష్టం చేసారు. 65 సం.లు పైబడిన వారు, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, హృద్రోగ సమస్యలు, ఇతర దీర్ఘకాల సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించరాదని ఆమె అన్నారు. మసీదుల వద్ద జరుగు ప్రార్ధనలలో ఒకసారి 50 మంది ముజల్లీ కి మాత్రమే అనుమతించడం జరిగిందని అన్నపూర్ణమ్మ చెప్పరు. వ్యక్తుల మధ్య విధిగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలని అన్నారు. మసీదులు, ఈద్గాలను పూర్తిగా శానిటైజర్ తో శుభ్రపరచాలని ఆమె సూచించారు. చరవాణిలలో "ఆరోగ్యసేతు యాప్' ను డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. ప్రార్ధనకు ఎవరి తివాచీ వారు తీసుకు రావాలని సూచించారు. మత పెద్దలు, కమిటీ నిర్వహకులు తగు శ్రద్ద తీసుకొని కరోనా మహమ్మారి భారీన పడకుండా మైకు ద్వారా రక్షణాత్మ సూచనలు చేయాలని, మసీదులు, ఈద్గాల వద్ద కరోనాపై అవగాహన కలుగుటకు ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రార్ధనలలో విధిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతికి గ్లోవ్స్ ధరించాలని, చేతులను తరచూ సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని ఆమె చెప్పారు. మసీదు, ఈద్గాల పరిసరాలలో ఉమ్మి వేయరాదని ఆమె పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఆచరించే కరచాలనాలు, ఆలింగనాలు చేయరాదని అన్నారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎవరికి వారే రక్షణ చర్యలు చేపట్టాలని, మీరు మీ కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉండాలని పేర్కొంటూ సురక్షిత జీవనంలో అందరూ భాగస్వామ్యం వహించుటకు ప్రార్ధనలు చేయాలని కోరారు. కరీనాకి నువ్వు ఒక ప్రాణం మాత్రమే, కానీ కుటుంబానికి నువ్వొక అమూల్యమైన మనిషివి - మన భద్రత మనమే తీసుకోవాలి అని ఆమె పిలుపునిచ్చారు.