సిస్టర్స్ ను అభినందించిన జె.సి..
Ens Balu
1
Srikakulam
2020-11-24 13:18:08
శ్రీకాకుళం పట్టణంలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( రిమ్స్ )లోని కోవిడ్ పేషెంట్లకు సేవలందించిన మథర్ థెరిస్సా హోమ్ సిస్టర్స్ ను సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. గత 15 రోజులుగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించి రిలీవ్ అవుతున్న సిస్టర్స్ కు సన్మాన కార్యక్రమం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలోని గిరిజన యువక శిక్షణా కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని గత 15 రోజులుగా రిమ్స్ లోని కోవిడ్ పేషెంట్లకు సహాయకులుగా ఉండి వారికి ఉపచర్యలు చేసిన సిస్టర్ మహిమ, సిస్టర్ జస్వింతలను జె.సి దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందించి అభినందించారు. మథర్ థెరిస్సా హోమ్ సిస్టర్స్ గత నాలుగు బ్యాచులుగా కోవిడ్ తో బాధపడుతున్న పేషెంట్లకు సహాయకులుగా ఉండి సేవలందిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించేందుకు స్వచ్చంధంగా ముందుకువచ్చిన సిస్టర్స్ కు జె.సి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సిస్టర్స్ తో ముచ్చటిస్తూ వారికి గత 15 రోజులుగా అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. గత మూడు బ్యాచులలో సిస్టర్స్ సేవలు అందించారని, తద్వారా కోవిడ్ పేషెంట్లలో వచ్చిన మార్పు గురించి జె.సి అడిగి తెలుసుకున్నారు. సేవలు అందించే సమయంలో కోవిడ్ పేషెంట్లకు గాని, సిస్టర్స్ కు ఎటువంటి సమస్యలు లేవని సిస్టర్స్ తెలియజేయడంతో జె.సి సంతోషించారు. కోవిడ్ సెకెండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున 2021 జనవరి మాసాంతం వరకు ఇదేస్పూర్తితో మథర్ థెరిస్సా హోమ్ సిస్టర్స్ కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప తహశీల్ధార్ యస్.సతీష్, గ్రామ రెవిన్యూ అధికారులు డి.వరలక్ష్మీ, పి.శ్రావణి, బి.రమేష్, పర్యవేక్షకులు టి.హరిసూర్య తదితరులు పాల్గొన్నారు.