26న చదవడం మాకిష్టం..
Ens Balu
1
Srikakulam
2020-11-24 17:15:47
శ్రీకాకుళం జిల్లాలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చదవడం మాకిష్టం లోగోను ఆయన ఆవిష్కరించారు. విధ్యార్ధుల్లో పాఠశాల స్థాయిలోనే పఠనాశక్తిని పెంపొందించే లక్ష్యాంతో విధ్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన తెలిపారు. వాక్యాల నుండి గ్రంథాల దాకా చదివే శక్తిని కల్పించడం దీని ఉద్దేశ్యమన్నారు. కథలు, పత్రికలు, జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాలు తదితర అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చదివే అభిరుచిని అలవాటు చేసి చదవటంలోని ఆనందాన్ని పరిచయంచేసి పిల్లల్ని పుస్తకలోకంలోకి ఆహ్వానించి ఉహాలోకాలలోకి రెక్కలు విచ్చుకొనే మహోన్నత ఉద్యమం అన్నారు. 26వ తేదీన శ్రీకాకుళం మండలం ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9.30 గంటలకు చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.