శ్రీ దండుమారమ్మకు కలెక్టర్ పూజలు..
Ens Balu
2
కనపాక
2020-11-24 18:43:07
విజయనగరం జిల్లాలోని కనపాక లో నిలయమైన శ్రీ దండుమారమ్మ అమ్మవారి గుడి ని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ గురువారం సందర్శించారు. గుడి కార్యవర్గ సభ్యులు, దేవస్థానం కార్యదర్శి రాకోటి అప్పల నాయుడు తదితరులు, పురోహితులు కలెక్టర్ ను సాదరంగా ఆహ్వానించి పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు అందజేసారు. గుడి విశిష్టతను వివరిస్తూ గుడిని పునర్న్ర్మించి 10 సంవత్సరాలు నిండాయని, నవంబర్ 24 న దశమ వార్షికోత్సవం జరుపుతున్నామని, ఈ సందర్భంగా హోమం, ప్రత్యెక పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకు లు కలెక్టర్ కు వివరించారు. దర్శన అనంతరం గుడి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ ఔషధ మొక్కలు, పర్యావరణానికి ఉపకరించే మొక్కలను ఖాళీప్రదేశాల్లో వేయాలని కోరారు. గుడి ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడానికి పలు సలహాలు, సూచనలు అందజేసారు. గుడి కి వెళ్ళే మార్గం లో ప్రవేశద్వారం తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తానని కలెక్టర్ గుడి నిర్వాహకులకు తెలిపారు. గుడికి వెళ్ళే మార్గాల్లో, కల్లెక్టరేట్ వద్ద భక్తులకు తెలిసేలా అమ్మవారి ఫోటోలు పెట్టి సైన్ బోర్డు లను పెట్టాలని సూచించారు.