నివర్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి..
Ens Balu
1
collectorate
2020-11-24 19:02:57
నివర్ తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వి సి హాల్ నుండి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసు బాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, నివర్ తుఫాన్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇదివరకే వీసీ నిర్వహించి సూచనలు జారీ చేశారన్నారు. జిల్లాలో జిల్లా కేంద్రం తో సహా డివిజన్, మండల స్థాయి లో కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు దెబ్బతినే అవకాశమున్నందున అందుకు సంబంధించి మైనర్ ఇరిగేషన్ అధికారులతో టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు రోజులపాటు తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అధిక వయసు గల ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు వీయనున్న నేపథ్యంలో రేకుల షెడ్లు గాలికి ఎగిరి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామాల్లోని వాలంటీర్లతో టాంటాం వేయడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. బలమైన గాలుల వలన విరిగిపడే చెట్లను తొలగించేందుకు విద్యుత్ రంపాలను ఉపయోగించి తొలగించడం జరుగుతుందని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు. నివర్ తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఆరోగ్య శిబిరాలు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు.