శ్రీ కపిలేశ్వరాలయంలో చండీయాగం ప్రారంభం..


Ens Balu
4
Tirupati
2020-11-24 19:14:04

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో  శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) మంగ‌ళ‌వారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు చండీయాగం జరుగనుంది. ఆల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్య‌హోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వ‌హిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.