07స్టార్ రేటింగ్ పై అభ్యంతరాలుంటే తెలపండి..
Ens Balu
4
జివిఎంసి
2020-11-24 19:54:16
స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంలో భాగంగా వివిధ అంశాలలో జీవిఎంసీ వృద్ధి సాధించిన నేపథ్యంలో “07 స్టార్ రేటింగ్ గార్బేజ్ ఫ్రీ సిటీ” గా స్వీయ నిర్ధారణ చేస్తూ తీర్మానించారని జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 07స్టార్ రేటింగ్ నేపథ్యంలో తేది. 24-11-2020 నుంచి ప్రజల నుంచి అభ్యంతరాలు 15 రోజల వ్యవధిలో కమిషనర్, జివిఎంసి, విశాఖపట్నం వారికి వ్రాతపూర్వకంగా గాని లేదా అంతర్జాలం ద్వారా gvmc.cmoh2016@gmail.com, gvmcpublichealth@gmail.com మెయిల్ అడ్రస్సులకు తెలియజేయాలన్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీకి సంబందించిన పూర్తి వివరాలు www.gvmc.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. చెత్తరహిత నగర స్థాయిని రోజులో ఏ సమయములోనైనా వాణిజ్య లేదా నివాస ప్రాంతాలు చెత్త రహితంగా చేస్తున్నామన్నారు. నూరు శాశం ఘన వ్యర్ధముల శాస్త్రీయ నిర్వహణ, డంప్ యార్డులయందు పేరుకుపోయిన వ్యర్ధాల పరిష్కారం చూపిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు, భవన నిర్మాణ వ్యర్ధముల నిర్వహణ మొదలగు అంశములలో ప్రభుత్వము వారి మార్గదర్శకాలు పాటిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు షరతులకు లోబడి జివిఎంసి పురోగతి సాధించిందని చీఫ్ మెడికల్ అధికారి తెలియజేశారు.